Team India: ఆగస్టులో భారత్ టీమ్ బంగ్లాదేశ్ పర్యటన 7 d ago

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ ఖరారైంది. భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆగస్టు 17, 20, 23 తేదీల్లో వన్డే మ్యాచ్ లు.. ఆగస్టు 26, 29, 31 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్ తో సిరీస్ మా హోం క్యాలెండర్లో ఉత్తేజకరమైన, ఎదురుచూస్తున్న సిరీస్.. భారత్, బంగ్లా పోరును ఇరు దేశాల అభిమానులు ఎంజాయ్ చేస్తారని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజామ్ ఉద్దిన్ చౌదరి తెలిపారు.